Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 3.73 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ పేపర్-1కు 2.13 లక్షల మంది, పేపర్-2కు 1.60 లక్షల మంది కలిపి మొత్తం 3.73 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. ఆన్లైన్లో టెట్ దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 12వ తేదీ వరకు అవకాశముందని తెలిపారు. పూర్తి వివరాల కోసం https://tstet.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.