Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విలేకరులు
కేరళలోని కన్నూర్‌లో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న సీపీఐ(ఎం) జాతీయ మహాసభలను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా ఆపార్టీ జెండాలను ఎగరవేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కిల్లే గోపాల్ జెండాను ఆవిష్కరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్, కర్రెమ్మ గుడి వద్ద సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ.జబ్బార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు జెండావిష్కరణ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంఓలని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ జెండాను ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని షెక్షాపేట్, గుల్జార్ మార్కెట్ ఏరియా, మహాలక్ష్మివాడతో పాటు పలు కాలనీల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా జన్నారం, తాండూర్ మండల కేంద్రంల్లోనూ పార్టీ జెండాలు ఆవిష్కరించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఏ.రమేష్‌బాబు జెండాను ఆవిష్కరించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో, రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద, యానం గుట్ట సుందరయ్య కాలనీలో, మామిడిపల్లి శాఖలలో జెండాలను ఆవిష్కరించారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలో ఊరూరా ఎర్రజెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పెండ్యాల బ్రహ్మయ్య, నాయకులు పాల్గొన్నారు. మంచాల మండల పరిధిలో జపాల, నోముల గ్రామంలో జెండా ఆవిష్కరించారు. వికారాబాద్ జిల్లా పరిగి జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య జెండా ఆవిష్కరించారు. దోమ మండల పరిధిలో ఎం. వెంకటయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పార్టీ జెండాను రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ ఆవిష్కరించారు. నల్లగొండ, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, తిరుమలగిరి, సాగర్ మండలాలతో పాటు ఎల్లాపురంతండా, రాజవరం, తిరుమలగిరి గ్రామాల్లో జెండాలను ఆవిష్కరించారు. యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంతో పాటు, ఆలేరు, రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్, మోటకొండూరు , తుర్కపల్లి, మండలాల్లో జెండాలను ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి, హుజూర్నగర్ ,మునగాల మండలంలో మునగాల, కొక్కిరేణి, జగన్నాథపురం గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేశారు. కోదాడ పట్టణంలో ప్రధాన రహదారి పక్కన హమాలీ అడ్డా వద్ద, నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.