Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రి సబితకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులను ఈనెల 25 నుంచి వచ్చేనెల 20వ తేదీలోగా చేపట్టాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సూచించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి బుధవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో ఖాళీ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. మండలి విద్యాధికారి పోస్టులు, ఉప విద్యాధికారి పోస్టులు, డైట్ లెక్చరర్ పోస్టులు, బీఈడీ లెక్చరర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని సూచించారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న సీఆర్టీలు, పీజీసీఆర్టీలకు పరస్పర మార్పిడి లేదా ఖాళీ ఉన్న చోటికి వారి కోరిక మేరకు మార్చాలని తెలిపారు. మన ఊరు-మనబడి కార్యక్రమం, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతున్న సందర్భంలో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా వచ్చే విద్యాసంవత్సరం ఉత్సాహపూరితంగా ప్రారంభించొచ్చని సూచించారు. మోడల్ స్కూళ్లలో 2013 నుంచి బదిలీలు, పదోన్నతులు నిర్వహించలేదని గుర్తు చేశారు. వాటిలో బదిలీలు, పదోన్నతులు తక్షణావసరంగా ఉన్నాయని తెలిపారు. కేజీబీవీ టీచర్లకు కుటుంబ అవసరాల రీత్యా కొందరికీ పాఠశాల మార్పిడి అవసరముందని పేర్కొన్నారు.