Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.: మంత్రి హరీశ్ రావు
- చేర్యాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-చేర్యాల
సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలపై పెను భారాలను మోపుతోందనిరాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు బుధవారం శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించిన రైతు బజార్, ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్‌ను ప్రారంభిం చారు. రూ.3 కోట్లతో నూతనంగా నిర్మించ తలపెట్టిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆడపడుచులకు కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్టు, రైతులకు రైతుబంధు, బీమా కల్పిస్తున్నామని తెలిపారు. 57 ఏండ్లు నిండిన వారికి కొత్త పెన్షన్లు త్వరలో మంజూరు చేస్తామన్నారు. జనగామ నియోజకవర్గానికి 3 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వసతులు కల్పిస్తూ 24 గంటల వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.6 కోట్లతో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ కార్యాలయ నిర్మాణ పనుల్లో జాప్యంపై ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా పండుగ నాటికి నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. చేర్యాల రూరల్ మండలంతో పాటు కొమురవెల్లి, మద్దూర్, దూళిమిట్ట మండలాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. జనగామ నియోజకవర్గంలో ఏఎన్ఎం కేంద్రాలకు నిధులు మంజూరు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు కేటాయించి త్వరలో ముగ్గు పోసుకోడానికి చర్యలు తీసుకుంటామన్నారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, రాజలింగం, ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ ఎస్.కె.ఆరిఫా, మున్సిపల్ చైర్పర్సన్ అంకుంగారి స్వరూప శ్రీధర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.