Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పండి
- సీఎస్ ఇతరులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టాలీవుడ్ డ్రగ్స్ కేసుల దర్యాప్తు రిపోర్టులు, కాల్‌డేటా, ఎఫ్ఐఆర్లు వంటికి ఈడీకి ఇవ్వాలన్న గత నెలలో జారీ చేసిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో వివరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని వారిని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదని, ఆ ఇద్దరు అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కార రిట్‌ను బెంచ్ విచారించింది. ఈడీకి సమాచారం ఎందుకు ఇవ్వలేదో సీఎస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్లు తెలియజేయాలని ఆదేశించింది. డ్రగ్స్్ కేసుల దర్యాప్తును కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించాలంటూ మల్కాజిగిరి ఎంపీ, పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం గతంలో విచారించింది. ఈ పిల్లో ఈడీ అధికారులు ఇంప్లీడై తాము కోరిన సమాచారం ఎక్సైజ్ విభాగం ఇవ్వడం లేదని ధర్మాసనానికి ఫిర్యాదు చేసింది. విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.
హాస్టల్లో దుస్థితిపై విచారణ
హైదరాబాద్ ఓల్డ్‌సిటీ, మలక్‌పేటల్లో బాలబాలికల ప్రభుత్వ హాస్టల్స్ రెండింటిలో నెలకొన్న దుస్థితులపై ఒక పత్రికలో వచ్చిన వార్తను హైకోర్టు పిల్‌గా స్వీకరించి గురువారం విచారించింది. ఆ రెండు హాస్టల్స్‌ను పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది రవించందర్ను ఆదేశించింది. గుడ్డు, మాంసం పెడుతున్నామన్న ప్రభుత్వ జవాబుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పిల్లల్ని గదుల్లో కుక్కి ఉంచడం, తరగతి గదిలోనే పిల్లలు ఉండాల్సిన దుస్థితులు నెలకొనడంపై ఆవేదన వ్యక్తం చేసింది. విచారణను ఈ నెల 12కి వాయిదా వేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం ప్రకటించింది.
ఒకరికి బెయిల్ మరొకరికి నిరాకరణ
న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణిల హత్య కేసులో 7వ నిందితుడు అనిల్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, 5వ నిందిడుతు లక్ష్మణ్‌కు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అనిల్ రూ.20 వేల వ్యక్తిగత బాండ్లను సమర్పించాలనీ, అంతే విలువగల మరో రెండు పూచీకత్తులు ఇవ్వాలనీ, కేసు విచారణకు కచ్చితంగా హాజరుకావాలని షరతులు పెట్టింది. లక్ష్మణ్‌కు నాలుగు నెలల క్రితం హైకోర్టు బెయిల్ నిరాకరించే నాటికీ నేటికీ పరిస్థితుల్లో మార్పు లేనందున బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు హైకోర్టు తీర్పు చెప్పింది.
క్యాట్ ఆదేశాలు కరెక్టే
రాష్ట్ర విభజన తరుణంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులకు కేంద్రం వేసిన ప్రత్యూష సిన్హా కమిటీ చట్ట విరుద్ధంగా పనిచేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ గురువారం హైకోర్టులో వాదించారు. ఆ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం సవాల్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. క్యాట్ఆదేశాలు కరెక్టేనని చెప్పారు. ఉమ్మడి ఏపీ చివరి సీఎస్ మహంతి కమిటీలో కొనసాగడం, ఆ కమిటీ సిఫార్సులను ఆమోదించడం సరికాదన్నారు. విచారణన వాయిదా పడింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివరాలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పండి.