Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదేనా మీరిచ్చే మర్యాద
- టీఆర్ఎస్ సర్కారుకు గవర్నర్ సూటి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గణతంత్ర, ఉగాది వేడుకలకు ఆహ్వానించినా ఎందుకు రాలేదని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థకు మీరిచ్చే మర్యాద ఇదేనా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్‌తో సహా అందరినీ ఆహ్వానించాననీ, అందుకు ఆధారాలు కూడా చూపిస్తానన్నారు. ఇది తన సమస్య కాదనీ, గవర్నర్ కార్యాలయానికి జరుగుతున్న అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆమె భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రొటోకాల్ వివాదంతోపాటు పలు అంశాలను అమిత్‌షాకు వివరించినట్టు తెలిపారు. అనంతరం తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. తానేప్పుడూ నిర్మాణాత్మకంగా ఆలోచిస్తానని చెప్పారు. తాను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల కోసమేనన్నారు. ప్రోటోకాల్ విషయంలో సీఎస్ వచ్చి సమస్య ఏంటో తనతో మాట్లాడాలని ఆదేశించారు. తాను అన్నిపార్టీల నేతలను కలిశాననీ, ఏదైనా అడిగితే సమాధానం చెబుతానన్నారు. ఈనెల 11వ తేదీన భద్రాచలంకు రోడ్డు మార్గంలోనే వెళ్తానని స్పష్టం చేశారు.