Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్‌కు మాకు పంచాయితీ ఎందుకుంటది?
- గవర్నర్ గవర్నర్‌గా వ్యవహరిస్తే గౌరవిస్తాం..
- సిరిసిల్లలో స్పందించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
సమస్యలపై సమాధానం చెప్పలేక అంశాలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ వాళ్లు గవర్నర్ అంశాన్ని తీసుకొస్తున్నారు.. అసలు గవర్నర్ వ్యవస్థతో మాకు పంచాయితీ ఎందుకుంటది..? అని మంత్రి కేటీఆర్ అన్నారు. గవర్నర్ తనను అవమానిస్తున్నారన్న వ్యాఖ్యలపై.. సిరిసిల్ల కలెక్టరేట్లో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ స్పందించారు. తమకు గవర్నర్‌కు ఎందుకు పంచాయితీ ఉంటుందని ప్రశ్నించారు. 'అసలు గవర్నర్‌కు ఎక్కడ అవమానం జరిగింది. ఎవరు ఎవర్ని అవమానించారు. గవర్నర్ గవర్నర్‌గా వ్యవహిస్తే తప్పకుండా గౌరవిస్తాం. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ నియామకం విషయంలో అభ్యంతరం పెట్టినందుకు అవమానిస్తారా? అని గవర్నర్ చెప్పినట్టు విన్నాను.. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డువచ్చిందా? తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డురాలేదా? గవర్నర్ మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు మాకు ఎలాంటి పంచాయితీ లేదు. గవర్నర్ విషయంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాం. శాసనసభ తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంది. సమావేశం ప్రొరోగ్ కాలేదు. అందుకే గవర్నర్ ప్రసంగం లేదు. వారు అవమానంగా తీసుకుంటే మేము చేయగలిగింది ఏమీ లేదు' అని అన్నారు.