Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్, హెచ్బీసీఎస్ఈ-హోమిబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఐఏపీటీ నిర్వహించిన జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థులు ఆధిపత్యం కొనసాగించారు. ఈ మేరకు నారాయణ గ్రూప్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పి సింధూర నారాయణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐవోక్యూజేఎస్ స్టేజ్-1లో దేశవ్యాప్తంగా 301 మంది విద్యార్థులు ఎంపికయ్యారనీ, అందులో నారాయణ నుంచి ఆరుగురు విద్యార్థులున్నారని వివరించారు. రాష్ట్రం నుంచి 33.3 శాతం, ఏపీ నుంచి 43 శాతం మంది విద్యార్థులు నారాయణ పాఠశాలల నుంచే ఎంపికయ్యారని తెలిపారు. నారాయణ రీసెర్చ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అయిన ఒలింపియాడ్, ఈ టెక్నో, టెక్నో, మెడిస్పార్ ప్రోగ్రామ్‌లలో శిక్షణ పొందిన విద్యార్థులే విజేతలుగా నిలవడం ఆనవాయితీగా మారిందని పేర్కొన్నారు. కొన్నేండ్లుగా పాఠశాల స్థాయిలో జరిగే అన్ని పోటీ పరీక్షల్లో నారాయణ విద్యార్థులు అప్రతిహతంగా విజయపరంపరను కొనసాగిస్తున్నారని వివరించారు.