Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఇద్దరికి గాయాలు
- రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీనడంతో ఘటన
నవతెలంగాణ-పటాన్చెరు
రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఆశిష్ ముజంధర్(20), శివనాథ్ రామ్, గురుదేవ్ బహుదూర్ బీరంగూడలో ఉంటూ మండలంలోని చిట్కుల్లో మేస్త్రి పని చేస్తూ జీవిస్తున్నారు. కాగా బుధవారం ముగ్గురు చిట్కుల్ గ్రామంలో పనులు ముగించుకొని రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో బైక్‌పై బీరంగూడకు వెళుతుండగా మండలంలోని ఏపీఆర్ విల్లాస్ దాటిన తర్వాత ఏపీఆర్ విలాస్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న శివ బుర్ర (21) అజిత్ తాంతి (21) లు బైక్‌పై డ్యూటీకి కిష్టారెడ్డిపేట వైపు నుంచి బైక్‌కు లైట్లు లేకపోవడంతో ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు ద్విచక్ర వాహనాలు ఢ కొన్నాయి. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఆశిష్ ముజంధర్ (20), సెక్యూరిటీ గార్డులిద్దరిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. శివనాథ్ రామ్, గురుదేవ్ బహుదూర్‌కు గాయాలయ్యాయి. ఈ మేరకు సీఐ వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు