Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్టీపి అధ్యక్షులు వైఎస్ షర్మిల
నవతెలంగాణ-కూసుమంచి
రాష్ట్రంలో రైతాంగం పండించిన యాసంగి వడ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు చేయాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో రైతు వేదిక వద్ద గురువారం యాసంగి వడ్లను సీఎం కేసీఆర్ కొనాలని ఆమె నిరసన దీక్ష చేపట్టారు. మండలంలో రెండో రోజు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు వడ్లు కొనమని చెప్పి, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. వడ్ల కొనుగోళ్ల నెపంతో ఢిల్లీ రాజకీయాలు మొదలుపెట్టారని అన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గతంలో అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినట్టుగానే రైతులు పండించిన చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై తమ వైఖరి స్పష్టం చేయాలన్నారు. రైతులను గందరగోళానికి గురి చేయెద్దని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గడిపల్లి కవిత, తదితరులు పాల్గొన్నారు.