Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు :టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింలు
నవతెలంగాణ-షాద్‌నగర్
పెంచిన కరెంట్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింలు అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ట్రాన్స్ కో డివిజనల్ ఇంజినీర్ యాదయ్యగౌడ్‌కు ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. అనంతరం నర్సింలు మాట్లాడుతూ.. ప్రజలు కరోనా నుంచి పూర్తిగా కోలుకోకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలపై కరెంట్ చార్జీలు పెంచి రూ. 5600 కోట్ల భారం వేసిందన్నారు. కరోనా సమయంలో ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అయిన ప్రజల బాధలను పట్టించుకోకుండా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సాగుకు విద్యుత్ సరఫరాలో కోతలు పెడుతున్నారని, వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తారనే ఆందోళనలో ప్రజలు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కరెంట్ చార్జీలు పెంచి ప్రజల జీవితాలతో చెలగాటాలాడుతున్నారని అన్నారు. మానవతా దృక్పథంతో కరెంట్ చార్జీలు తగ్గించకుంటే టీటీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్ రెడ్డి, గంధం ఆనంద్, విఠ్యాల అంజయ్య, చేగూరి బాల్‌రాజ్‌గౌడ్, బాలమోని హన్మంత్ యాదవ్, విఠ్యాల పాషా, కందూరి అంజయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.