Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ సౌధ వద్ద లాఠీ చార్జీ
- రేవంత్తోసహా పలువురి నేతల గృహ నిర్బంధం
- తెల్లవారుజామునే ఇంటివద్ద మొహరింపు
- పలువురికి గాయాలు... సృహతప్పిన మహిళానేత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ కరెంట్ పోరు ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడ్కికడ అరెస్టులు, గృహ నిర్బాందాలు చేశారు. విద్యుత్ సౌధ, పౌరసరఫరాల కార్యాలయం ముట్టడి నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెల్లవారుజామన నుంచే ఆయన ఇంటి వద్ద పోలీసులను మొహరించారు. అదే విధంగా పలువురు నేతలను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎక్కడిక్కడ నాయకులను గృహ నిర్బంధం చేశారు. కొంత మందిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. గురువారం హైదరాబాద్‌లో విద్యుత్ చార్జీలు, పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ నెక్లెస్ రోడ్డు నుంచి ర్యాలీగా బయలు దేరి విద్యుత్ సౌధా, పౌరసరఫరా కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేయాలని టీపీసీసీ చీప్ రేవంత్ పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు తొలుత అనుమతి నిరాకరించారు .అప్పటికే ఫిషర్‌మేన్ రాష్ట్ర చైర్మెన్ మెట్టుసాయికుమార్ ఆధ్వర్యంలో కొంత మంది కార్యకర్తలు విద్యుత్ సౌధాను ముట్టడించే ప్రయత్నం చేశారు. వారిపై పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. మరికొంత మందిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను రోడ్డు మీదికి రాకుండా పోలీసులు నిలువరించారు. ఆ తర్వాత నిరరసన తెలిపింపేందుకు పోలీసు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో రేవంత్‌తో సహా పార్టీ నేతలు నెక్లెస్రోడ్డ్కు చేరుకున్నారు.ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి ఖైరతాబాద్ మీదుగా విద్యుత్ సౌధకు ర్యాలీగా బయలుదేరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ డౌన్, డౌన్ అంటూ నినదించారు.అప్పటికే ఖైరతాబాద్ చౌరస్తాలో మళ్లీ అడ్డుకున్నారు. భారీకేడ్లు, ముండ్ల కంచెలు ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌధకు అనుమతి లేదంటూ ఒక బృందాన్ని మాత్రమే పంపిస్తామంటూ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులకు రేవంత్, ఇతర నాయకులకు, మధ్య వాగ్వాదం జరిగింది. రేవంత్, ఎమ్మెల్యే దూద్దిళ్ల శ్రీదర్ బాబు, ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీిగౌడ్, యూత్ నాయకులు అనిల్‌కుమార్ యాదవ్, శివసేనారెడ్డి తదితరులు బారికేడ్లు ఎక్కి అవతలవైపు దూకి విద్యుత్ సౌధ వైపు దూసుకెళ్ళారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ తర్వాత ఒక బృందాన్ని సీఎండీ ప్రభాకర్‌రావు వద్దకు తీసుకెళ్లారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరారు. పెరుగుతున్న ధరలతో సామాన్యులు బతకలేదని స్ధితి ఏర్పడిందని చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, మధుయాష్కీ, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, దాసోజు శ్రవణ్, వినోద్ రెడ్డి, బక్క జడ్సన్లతోపాటు పలువురు నాయకులను గహ నిర్బంధాలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు ఫిరోజ్‌ఖాన్, వినోద్‌రెడ్డి, ఓబీసీ విభాగం చైర్మెన్ నూతి శ్రీకాంత్ మైనార్టీ విభాగం చైర్మెన్ సోహెల్, దళిత కాంగ్రెస్ చైర్మెన్ ప్రీతమ్, విద్యార్థి నేత వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో పలువురు విద్యుత్ సౌధ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళా నాయకురాలు విద్యారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా కాంగ్రెస్ నాయకుల అరెస్టులను ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.