Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజరు
నవతెలంగాణ-కూసుమంచి
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళ చెరువు గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహౌత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండ లాగు ప్రదర్శన పోటీలను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డితో కలిసి మంత్రి పువ్వాడ అజరుకుమార్ గురువారం ప్రారంభించారు. ఈ పోటీలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఇంటూరు శేఖర్ యువసేన ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీల్లో సీనియర్స్, జూనియర్స్, న్యూ క్యాటగిరి, ఎద్దుల పోటీలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధు, జడ్పీటీసీ చైర్మెన్ లింగాల కమల్ రాజు, ఖమ్మం నగర మేయర్ పునకోల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.