Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డాగా హైదరాబాద్ : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారడానికి సీఎం కేసీఆర్ కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు ఆరోపించారు. హైదరాబాద్ డ్రగ్స్ విషయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే సొంతూళ్లకు రమ్మని ఒత్తిడి చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌ను మాఫియా, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని విమర్శించారు. డ్రగ్స్ మాఫియా వల్లనే పంజాబ్‌లో ప్రభుత్వం కూలిపోయిందనీ, తెలంగాణలోనూ ఆ పరిస్థితి రాబోతున్నదని హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలో డ్రగ్స్ దందా నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబసభ్యుడికి రాష్ట్రంలో 112 వైన్స్ షాపులున్నాయని చెప్పారు. డ్రగ్స్ కేసులో విచారణ చేసిన అధికారులను సైతం ఢిల్లీకి పంపేశారన్నారు. విచారణ పేరుతో 2015 నుంచి ఏం సాధించారో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో తన కుటుంబానికి సంబంధం ఉన్నందునే ఈడీకి కేసీఆర్ సహరించలేదనీ, కేసీఆర్ వల్ల ఒక ఐపీఎస్ అధికారి బలైపోయిండని ఆరోపించారు.