Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య ఈ ఏడాది 17కు పెరగనున్నాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో వెల్నెస్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లను కూడా పెంచబోతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామనీ, సేవల నాణ్యతను పెంచేందుకు కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకొని అమలు చేస్తున్నామని తెలిపారు.