Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సహకార సంస్థ(జీసీసీ) చైర్మెన్‌గా రమావత్ వాల్యా నాయక్ శుక్రవారం హైదరాబాద్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన చైర్మెన్‌కు మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి మరింత బాధ్యతగా పనిచేసేందుకు పదవులను ఉపయోగించుకోవాలని సూచించారు. పేదలు,మధ్యతరగతి ప్రజలు వృద్ధిలోకి తీసుకురావా ల్సిన బాధ్యత ఉందన్నారు. 75ఏండ్ల కాలంలో స్వతంత్ర భారత దేశంలో గిరిజనుల సమగ్ర అభివృద్ధికి పాల్పడుతున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని చెప్పారు.అసెంబ్లీలో గిరిజన రిజర్వేషన్ల ను 10శాతానికి పెంచాలని తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీి ప్రభుత్వం తమకు ఆ బిల్లుపై ప్రతిపాద న రాలేదంటూ పార్లమెంట్ సాక్షిగా చెప్పటం సిగ్గుచేటన్నారు. జీసీసీ డిపోల ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాల్లోనీ అడవి బిడ్డలు సేకరించే అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ, వారికి అవసరమయ్యే వస్తువులను వీటి ద్వారానే అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హోమ్ శాఖ మంత్రి మహమ్మద్ అలీ, ఎక్సైజ్ , టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి, తెలంగాణ క్రీడల అభివృద్ధి చైర్మెన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, జీసీసీ మాజీ చైర్మెన్ గాంధీ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఇతర అధికారులు, నేతలు హాజరయ్యారు.