Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12న మండల కేంద్రాల్లో నిరసనలు
- 15 నుంచి ఐదు బృందాలతో రైతు పోరు
- అస్సాం సీఎంను అరెస్టు చేయాలి : టీపీసీసీ కార్యవర్గంలో నిర్ణయాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ అన్నారు. వడ్ల కొనుగోళ్ల కోసం ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, ఈనెల 12 నుంచి మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ నెలాఖరులో రాహుల్‌గాంధీ రానున్నట్టు తెలిపింది. శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ముఖ్యనాయకులు సమావేశమయ్యారు. అందులో తీసుకున్న నిర్ణయాలను మధుయాష్కీ మీడియాకు వివరించారు. రైస్‌మిల్లర్లతో కల్వకుంట్ల కుటుంబం కుమ్మక్కైయిందనీ, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐదు బృందాలుగా ఏర్పడి రైతాంగ సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు. సోనియాగాంధీని కించపరిచేలా మాట్లాడిన అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ ఈనెల 14న హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.