Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో భద్రాచలంకు రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 280 బస్సులను నడపనున్నట్టు టీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ తొమ్మిదిన, 10న ఖమ్మం, పర్ణశాల, కొత్తగూడెం, మధిర, మణుగూరు, సత్తుపల్లి, విజయవాడ, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ నుంచి భద్రాచలంకు, తొమ్మిదన హైదరాబాద్ నుంచి భద్రాచంలకు, 10న భద్రాచలం నుంచి హైదరాబాద్ బస్సులను నడుపనున్నది. భద్రాచలం నుంచి పర్ణశాలకు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు, అదే విధంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక బస్సులకు ఆఫ్లైన్, ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు.