Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల సాగుకు ప్రణాళికలు
- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
వనపర్తి ప్రాంతం ఆయిల్ ఫామ్ తోటల సాగుకు అనుకూలమని, అందుకనుగుణంగా రైతులు తోటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా రూరల్ పరిధిలోని కడుకుంట్ల గ్రామంలోని ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీని మంత్రి శుక్రవారం సందర్శించారు. ఏటా రూ.80 వేల కోట్ల విలువైన పామాయిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దేశంలో నూనె గింజలకు మంచి డిమాండ్ ఉందన్నారు. అందువల్ల రైతులు వీటి సాగుకు ముందుకు రావాలని, అలాంటి వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వచ్చే జూన్ తర్వాత మూడు లక్షల ఎకరాల్లో సాగుకు రైతులు సిద్ధంగా ఉండాలన్నారు. ఆయిల్ ఫామ్ క్షేత్రాల్లో నాలుగేండ్ల వరకు అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చని తెలిపారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో చేపట్టిన మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అనంతరం పెద్దగూడెంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోదండ రాముల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభి ంచారు.