Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీశాఖ స్టాల్‌కు ప్రథమ బహుమతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అటవీశాఖకు ప్రథమ బహుమతి లభించిందని పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.డోబ్రియల్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణకు హరితహారం ద్వారా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏడేండ్లలో అమలు చేసిన పచ్చదనం పెంపు, జంతు సంరక్షణ చర్యలు, పర్యావరణ హిత కార్యక్రమాలను అటవీశాఖ ప్రదర్శించిందని పేర్కొన్నారు. అడవి థీమ్‌తో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారంతో పాటు పిల్లల కోసం ఏర్పాటు చేసిన మినీ జూ కూడా సందర్శకులను బాగా ఆకర్షించిందని తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ చేతులమీదుగా అటవీశాఖ అధికారులు ప్రథమ బహుమతిని అందుకున్నారని పేర్కొన్నారు. ప్రథమ బహుమతి తీసుకురావడంతో కృషిచేసిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నట్టు తెలిపారు.