Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి పనిదినం వరకు మమ్మల్ని కొనసాగించాలి
- ఇంటర్ విద్య కమిషనర్‌కు గెస్ట్‌లెక్చరర్ల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు పీరియెడ్ విధానం ఎత్తేసి, కన్సాలిడేట్ పేను వర్తింపచేయాలని గెస్ట్ లెక్చరర్ల సంఘం (2152) డిమాండ్ చేసింది. ఈమేరకు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో టిగ్లా అధ్యక్షులు ఎం జంగయ్య, గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. గెస్ట్ లెక్చరర్లకు పీరియెడ్ విధానం గుదిబండగా మారిందని తెలిపారు. ప్రభుత్వం ప్రతినెలా పూర్తి బడ్జెట్‌ను జీతాల కోసం విడుదల చేస్తున్నా పీరియెడ్ విధానం వల్ల పూర్తి వేతనం పొందలేకపోతున్నామని వివరించారు. ప్రస్తుత విద్యాసంవత్సరం చివరి పనిదినం పొడిగించిన నేపథ్యంలో తమ సేవలను సైతం అప్పటి వరకు కొనసాగించాలని సూచించారు. పీరియెడ్ విధానం వల్ల గెస్ట్ లెక్చరర్లకు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని జలీల్ తమతో అన్నారని తెలిపారు. ఈ విషయంలో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపిస్తామన్నారని తెలిపారు. గెస్ట్ లెక్చరర్లను చివరి పనిదినం వరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర నాయకులు మహేష్‌కుమార్, బాబురావు, కృష్ణ, మొహమ్మద్ షహీద్అలీ, ఆఫీజ్ ఖాజా, పరమేష్ తదితరులున్నారు.