Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత మహాసభల్లో పలు తీర్మానాలు
- జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా అనిమేష్ మిత్రా, పి అభిమన్యు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఎస్ఎన్ఎల్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందనీ బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ 10వ అఖిల భారత మహాసభ పిలుపునిచ్చిందని యూనియన్ తెలంగాణ సర్కిల్ కార్యదర్శి జి సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అస్సాం రాజధాని గౌహతిలో ఏప్రిల్ రెండు నుంచి నాలుగు వరకు జరిగిన మహాసభల్లో తెలంగాణ సర్కిల్ నుంచి 31 మంది ప్రతినిధులు హాజరైనట్టు తెలిపారు. ఈ మహాసభల్లో సంస్థ రక్షణకోసం పలు తీర్మానాలు చేసినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగం కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్కు 4జి సర్వీసులను ప్రారంభించకుండా కేంద్ర ప్రభుత్వం ఆటంకాలను కల్పిస్తున్నదని తెలిపారు. 5 జి సర్వీసులకు వెంటనే ప్రారంబించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మహాసభలో చర్చ జరగిందని తెలిపారు.