Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలీలు వెళుతున్న ట్రాలీ ఆటోను ఢకొీట్టిన లారీ
- నలుగురు కూలీలు మృతి
- రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : జీఎస్ఆర్
నవతెలంగాణ-శాయంపేట
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలో ఉపాధి లేక ప్రక్క మండలాలకు ఉపాధి కోసం వెళుతున్న కూలీల వాహనాన్ని లారీ ఢ కొట్టింది. లారీ అతివేగంగా వచ్చి రాసుకుంటూ వెళ్లడంతో ఇద్దరూ మహిళ కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు వరంగల్‌లోని ఎంజీఎంలో మృతి చెందారు. మరో 10మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని మాందారిపేట శివారులోని కేజీబీవీ పాఠశాల మూలమలుపులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పత్తిపాక నుంచి 40 మంది మహిళా కూలీలు మొగుళ్లపల్లి మండలంలో మిరపతోటలో మిర్చి ఏరటానికి ట్రాలీ ఆటోలో బయలుదేరారు. కేజీబీవీ సమీపంలోని మూల మలుపు వద్దకు రాగానే ఓ లారీ మరోలారీని ఓవర్టేక్ చేయబోయి కూలీలున్న ఆటోను బలంగా ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో రేణుక (45), పూల మంజుల (45) అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా అక్కడ దండెబోయిన విమల (45), చల్లఅయిలు కొమరమ్మ (45) మృతి చెందారు. కోడిమాల సరోజన, చల్లా రాధ చేతులు విరిగి చికిత్స పొందుతున్నట్టు డాక్టర్లు తెలిపారు. సురబోయిన రేణుక, జక్కుల ఐలమ్మ, గుండెబోయిన ఒదమ్మ స్వల్ప గాయాలపాలై మండలంలో చికిత్స పొందారు. ఘటనా స్థలిని ఏసీపీ శివరామయ్య సందర్శించి దర్యాప్తు చేపట్టారు. శాయంపేట, దామెర ఎస్ఐలు ఇమ్మడి వీరభద్రరావు, హరిప్రియ క్షతగాత్రులను వాహనాల్లో ఎంజీఎంకు తరలించారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన శరీర అవయవాలను సేకరించి ఎంజీఎంకు పంపించారు. కాగా, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురు మహిళా కూలీలు పత్తిపాక గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మతుల కుటుంబాలను ఆదుకుంటాం : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను, గాయాలపాలైన వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి ఎంజీఎంలో పరామర్శించారు.
పభుత్వం తరపున మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.25 వేలు చొప్పున చెక్కులు అందించారు. మతుల కుటుంబాలను భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎంజీఎంకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌ను ఆదేశించారు.
రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : జీఎస్ఆర్
ప్రమాదంలో మృతి చెందిన కూలీల కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు (జీఎస్ఆర్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఇసుక, బొగ్గు లారీలు అతివేగంగా వెళ్తూ సామాన్యులను బలి తీసుకుంటున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.