Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముత్యాల తలంబ్రాలు తీసుకురానున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- పోలీసుల నిఘాలో పుణ్యక్షేత్రం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం ఆదివారం మిథిలా స్టేడి యంలో అంగరంగ వైభవం గా జరగనుంది. రెండేండ్ల తరువాత సందర్శకుల సమక్షంలో సీతారాముల కల్యాణ మహోత్సవం
జరగనుంది. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి సందర్శకులు భద్రాద్రి బాటపట్టారు. సీతారామ కల్యాణ మహౌత్సవం ఉదయం 10.30 గంటల నుంచి 12:30 వరకు అభిజిత్ లగంలో నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రంలో విద్యుత్తు దీప అలంకరణలు, చలువ పందిళ్ల, చాందినీ వస్త్రాలంకరణలు, శ్రీరామ ధ్వజాలు ఏర్పాటు చేశారు. స్వామివారి కల్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలను పంపిణీ చేసేందుకు 80 ప్రత్యేక కౌంటర్లు భద్రాచలం లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. లడ్డూ ప్రసాదాల విక్రయాల కు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మూడు లక్షలకు పైగా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. 24 సెక్టార్లలో 35,006 మంది మిథిలా స్టేడియంలో స్వామివారి కల్యాణాన్ని తిలకించనున్నారు. అదేవిధంగా సీఎం సెక్టారు, జుడీషియల్ సెక్టార్, వీఐపీ, ఉభయ దాతల సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఎండ వేడిమి అధికంగా ఉండటంతో ఏసీలు, 60 కూలర్లు, 250 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం శ్రీరామ నవమికి వచ్చే వారి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్టీసీ మూడ్రోజుల్లో 850 పైగా బస్సులను ప్రత్యేకంగా నడుపుతోంది. భద్రాచలంలో అన్ని ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. రామాలయ పరిసరాలు, గోదావరి నదీ తీరంలోనూ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్సీ సునీల్‌దత్ పర్యవేక్షణలో భద్రాచలం ఏఎస్పీ రోహితరాజ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.