Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని శనివారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరాముడి గుణగణాలను శ్లాఘిస్తూ, భవిష్యత్ తరాలకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. సీతారాముల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సీతారామలు జీవితం దేశప్రజలకు ఆదర్శప్రాయమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షులు ఏ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు కూడా వేర్వేరు ప్రకటనల్లో రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.