Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత పార్టీ వాళ్లు ఉన్నా వదలం
- సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీనివాసగౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలను నిరోధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుపోతున్నదని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సొంత పార్టీ వాళ్లు ఉన్నా సరే వదలబోమని హెచ్చరించారు. సమాజంలో ఎప్పటినుంచో ఉన్న వీటిని క్రమంగా కూకటివేళ్లతో పెకిలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో పబ్యజమానులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అబ్కారీ శాఖా సంచాలకులు సర్ఫరాజ్, అదనపు కమిషనర్ అజరు ఉన్నారు. పబ్‌ల నిర్వహణ విషయంలో పాటించాల్సిన నియమ నిబంధనలపై యజమానులతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ మొదటి దశలో పేకాట క్లబ్‌లను మూసి వేయించారని గుర్తు చేశారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులను సమన్వయం చేసుకుంటూ....అబ్కారీ శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు చేస్తున్నా చట్టాన్ని అతిక్రమిస్తే అవసరమైతే పీడీ చట్టం ప్రయోగిస్తామన్నారు. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న చెడ్డ పేరు తెస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిజాయతీగా వ్యవహరిస్తేనే పబ్‌లకు అనుమతిస్తామనీ, లేకపోతే సీజ్ చేస్తామన్నారు. మాదక ద్రవ్యాలు విక్రయిస్తే మాత్రం సహించేది లేదన్నారు. రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందంటే, పబ్‌లను మూసేయడానికి కూడా వెనుకాడేది లేదన్నారు.
గవర్నర్లను ఎలా గౌరవించాలో మాకు తెలుసు: తలసాని
గవర్నర్లను ఎలా గౌరవించాలో తమకు తెలుసనని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్ అందరికంటే ముందుంటారన్నారు. శనివారం తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లు జరగనప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. గవర్నర్లు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలని సూచించారు.