Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు ప్రోగ్రామ్‌లు ప్రారంభించిన శ్రీచైతన్య ఐఏఎస్ అకాడమి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి పాసయ్యే విద్యార్థులకు శ్రీచైతన్య ఐఏఎస్ అకాడమి అద్భుత అవకాశం కల్పించింది. కెరియర్ ఓరియెంటెడ్‌గా ఏడు ప్రోగ్రామ్‌లు ప్రారంభించింది. శ్రీచైతన్య చైర్మెన్ బిఎస్ రావు, అకడమిక్ డైరెక్టర్ సుష్మ శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఏకంగా ఏడు ప్రోగ్రామ్‌లు ఏకకాలంలో ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పదో తరగతి పాసయ్యే విద్యార్థులకు అది అద్భుత అవకాశమని అన్నారు. ఇంజినీర్, డాక్టర్ కోర్సులకు భిన్నంగా, కెరియర్ ఓరియెంటెడ్‌గా ఈ ప్రోగ్రామ్‌లకు శిక్షణ అందిస్తామని వివరించారు. ఇంటర్, డిగ్రీతోపాటు సివిల్స్, ఇంటర్‌తోపాటు క్లాట్, ఐపీఎం, సీయూఈటీ, ఎస్ఏటీ, నిఫ్ట్, ఐహెచ్ఎంలకు రిజల్ట్స్ ఓరియెంటెడ్‌గా నిపుణులతో బోధన, మెరుగైన మెటీరియల్‌తో ప్రత్యేక కోచింగ్ అందిస్తామని చెప్పారు. ఇంటర్, డిగ్రీ తర్వాత సివిల్స్ ప్రోగ్రామ్, ఇంటర్ తర్వాత ఎల్ఎల్బీ కోసం క్లాట్ ప్రోగ్రామ్, ఐఐఎంలో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సులో చేరేందుకు ఐపీఎం ప్రోగ్రామ్, వివిధ దేశాల్లోని వర్సిటీల్లో డిగ్రీ చదివే వారి కోసం ఎస్ఏటీ ప్రోగ్రామ్, 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ చదివే వారి కోసం సీయూఈటీ ప్రోగ్రామ్, దేశంలోని 17 నిఫ్ట్ ఇన్స్టిట్యూట్లలో ఎక్కడైనా నాలుగేండ్ల డిగ్రీ కోసం నిఫ్ట్ ప్రోగ్రామ్, 21 సెంట్రల్ హోటల్ మేనేజ్మెంట్ స్కూళ్లలో ఎక్కడైనా డిగ్రీ చదివేందుకు ఐహెచ్ఎం ప్రోగ్రామ్ అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఐఐటీ, నీట్‌కు భిన్నమైన కెరియర్ ఆశించి టెన్త్ పాసయ్యే విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్‌లు అద్భుత అవకాశమని చెప్పారు. ఇంటర్‌తోపాటు ఈ కోర్సులకు శిక్షణ తీసుకుని వారి కలలను, లక్ష్యాలను సాధించాలని కోరారు.