Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ టీఆర్ఎస్ ఆందోళనలు చేస్తున్నదని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను, ఆర్టీసీ చార్జీలను పెంచింందని విమర్శించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతూ చార్జీలను పెంచడాన్ని తీవ్రంగా ఖండించింది. వెంటనే ఆ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ, సహాయ కార్యదర్శి పోటు రంగారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రేపటినుంచి ఏఐకేఎంఎస్ నిరసనలు
కనీస మద్దతు ధర చట్టం చేస్తామనీ, యూపీలోని లఖింపూర్ ఖేరీ నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చడంలో కాలయాపనను వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి ఈనెల 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా నిరసనలు చేపట్టాలని ఆలిండియా కిసాన్ మజ్దూర్ సభ (ఏఐకేఎంఎస్) పిలుపునిచ్చింది.
ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏఐకేఎంఎస్ అధ్యక్షులు రాయల చంద్రశేఖర్ అధ్యక్షతన హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో జరిగింది. అనంతరం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.