Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు
- శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ 37వ వార్షికోత్సవ సభ
- 17న హైదరాబాద్‌లో సామాజిక అంశాలపై సెమినార్
నవతెలంగాణ - పటాన్ చెరు
ఆర్థిక, సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా వర్గ పోరాటాల్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రా మికవాడలోని శాండ్విక్ పరిశ్రమలో శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ 37వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఫౌండర్ సభ్యులు, యూనియన్ అధ్యక్షులు చుక్కా రాములు యూనియన్ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 09/04/1985లో సీఐటీయూ అనుబంధం గా స్థాపించిన శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ (పూర్వపు విడియా ఎంప్లాయిస్ యూనియన్)ను37 సంవత్స రాలపాటు ఐక్యంగా నిలబెట్టుకుంటూ వచ్చామన్నారు.
అనేక అద్భుత విజయాలు సాధించి 13 వేతన ఒప్పందాల ద్వారా కార్మిక సంక్షేమానికి నిరంతరం పాటుపడట ం అభినందనీయమ న్నారు. దీనికి సహకరి ంచిన కార్మిక సోదరులందరికీ అభినందన లు,శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, సమాజంలో లింగ వివక్ష చూపిస్తూ సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆర్థికపరమైన అంశాల ద్వారా మాత్రమే కార్మికుల సమస్యలు పరిష్కారం కావని, ఆర్థిక సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా వర్గ పోరాటాల్ని నిర్మించినప్పుడే సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పటికే సీఐటీయూ ఆ కార్యక్రమం ప్రారంభించిందని, ఈ పోరాటానికి ఆర్థిక సహకారం అందించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈనెల 17న హైదరాబాద్‌లో సామాజిక అంశాలపై జరిగే సెమినార్‌కు కార్మికులు అత్యధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అనంతరం 37వ వార్షికోత్సవం సందర్భంగా గతంలో యూనియన్ ఆఫీస్ బేరర్స్‌గా పనిచేసిన వారిని, ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న ఆఫీస్ బేరర్లను పుష్పగుచ్ఛాలు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.