Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్లర్లో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్నది అన్నదాత పోరాటం మాత్రమే కాదనీ, అంతకు మించి తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని పురపాలక, పారిశ్రామిక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డిని ట్యాగ్ చేస్తూ కామెంట్ పెట్టారు. యాసంగి వడ్ల కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదని రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ముందే సూచించారనీ, కానీ, కేంద్రంతో వడ్లు కొనిపించే బాధ్యత తమదేనని చెప్పి రైతులతో గల్లీ బీజేపీ నాయకులు వరి వేయించారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ ధాన్యాన్ని కొనబోమని ఢిల్లీ బీజేపీ మొండికేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను ఆగంజేసిన బీజేపీ నాయకులను తరిమికొట్టాలని మంత్రి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పండిన వరిధాన్యాన్ని కొనేదాకా కేంద్రాన్ని వదిలేదే లేదన్నారు.