Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10,000 వేల ఆర్థిక సహాయం అందజేసిన
- ఆమన్‌గల్ మెడికల్ షాప్ నిర్వాహకులు పాపి శెట్టి రాము
నవ తెలంగాణ -వెల్దండ
వెల్దండ గ్రామంలో మరో పేద విద్యార్థి విద్యా కుసుమం తెల్గమల్ల సృజన ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని మెడికల్ కళాశాలలో సీటు సాధించారు. శనివారం ఆమన్‌గల్ సాయిరాం మెడికల్ షాప్ నిర్వాహకులు పాపిశెట్టి రాము సృజన తల్లిదండ్రులు ఫ్రాంక్లిన్ అలివేలకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పాపిశెట్టి రాము మాట్లాడుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన సృజనకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిరంజన్, పాతలావత్ శ్రీనివాస్ నాయక్, పూరి రమేష్, చిత్తరంజన్ దాస్ వెంకట్ రెడ్డి గోకమల్ల రాజు పాల్గొన్నారు.