Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌పీఐ) ఐదో మహాసభలు ముగిశాయి. ఈ సారి సదస్సు కోసం ఫ్యామిలీ మెడిసిన్, ప్రైమరీ కేర్ అంశాన్ని ఎంచుకున్నారు. హైదరాబాద్ శుక్రవారం మొదలై ఆదివారం సాయం త్రం వరకు కొనసాగాయి. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, బీబీనగర్ ఎయిమ్స్‌లో మొదటి రోజు సమావేశాలు జరగగా, చివరి రెండు రోజులు జూబ్లిహిల్స్‌లోని అపొలొ మెడికల్ కాలేజీలో జరిగింది. మూడో రోజు సమావేశంలో ప్రముఖ వైద్యనిపుణులు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) అధ్యక్షులు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డితో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇన్ఫెక్షన్ డిసీజెస్‌కు సంబంధించిన నిపుణులు డాక్టర్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీకాలు, హెచ్ఐవీ, టీబీ, వయస్సు పైబడిన వారు ఏ రకమైన మందులు వాడవచ్చనే అంశాలను చర్చించారు. గౌహతి ఎయిమ్స్‌కు చెందిన వారు కరోనా, లాక్ డౌన్ కాలంలో ఇండ్లలో పెరిగిన గృహహింసకు సంబంధించిన సైలెంట్ పాండమిక్‌ను వివరించారు.