Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదమ్ముల ఆత్మహత్య
- రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం
- నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘటన
నవతెలంగాణ -నల్లగొండ
అప్పులు తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెడితే.. నష్టాలు మిగిల్చింది.. తెచ్చిన అప్పులు తీర్చలేక ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం నల్లగొండ జిల్లాలో జరిగింది. టూటౌన్ ఎస్ఐ రాజశేఖరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
నల్లగొండ మండలంలోని పెద్ద సూరారం గ్రామానికి చెందిన మార్త శ్రీకాంత్(45), వెంకన్న(30) అన్నదమ్ములు. నల్లగొండ ఫ్లైఓవర్ సమీపంలోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు. రెండు అంతస్తుల ఇంట్లో పైన అన్న, కింద తమ్ముడు నివాసముంటున్నారు. శ్రీకాంత్ నల్లగొండ పట్టణంలోని సంఘమిత్ర బ్యాంకులో ఫీల్డ్ అఫీసర్‌గా పనిచేస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. సుమారు రూ.కోటికిపై అప్పులు చేసి వ్యాపారంలో పెట్టారు. చివరికి వ్యాపారంలో నష్టం వాటిల్లడంతో అప్పులు తీర్చలేకపోయారు. అన్నదమ్ములిద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేర్వేరు గదుల్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని విచా రణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీకాంత్‌కు భార్య, కుమారుడు, కూతురు, వెంకన్నకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.