Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీసీ బిల్లు సాధించే వరకూ ఢిల్లీని వదిలేది లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో ఓబీసీ జాతీయ ప్రముఖులతో మహాత్మా జోతిబాఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివక్ష లేని సమసమాజ స్థాపన కోసం ఆయన జీవితాంతం శ్రమించారని చెప్పారు. పార్లమెంటులో బీసీ బిల్లు సాధన కోసం మరో స్వాతంత్య్ర పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు. రాజకీయపార్టీలు బీసీలను కేవలం ఎన్నికలపుడే వాడుకోవడం పరిపాటిగా మారిందన్నారు. రాత్రికి రాత్రే ఈడ్ల్యూఎస్ బిల్లు తేవడం సాధ్యమైనపుడు బీసీ బిల్లు ఎందుకు సాధ్యం కావడం లేదని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పూణేకు చెందిన పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఓబీసీ ఉద్యోగ నాయకులు సునీల్నాలే, చంద్రకాంత్, యూపీ జర్నలిస్టు ప్రతినిధి స్వామి పాటిల్ రాజ్ప్ూ, విద్యావేత్తలు ప్రశాంత్ టాకావాలే, కేశల్ గుప్తా, అమిత్పోప్తాని తదితరులు పాల్గొన్నారు.