Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులను కలిసే అవకశముందనీ, అయినా సీఎం కేసీఆర్ కలవలేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీలో సీఎం కేసీఆర్ దొంగ దీక్ష చేశారని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మెట్టు సాయికుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. 'పన్ను నొప్పితో పది రోజులపాటు ఢిల్లీలో ఉన్న చంద్రశేఖర్‌రావు పట్టు వస్త్రాలతో తిరిగిండు. చుట్టూ ఎయిర్ కండీషన్లు పెట్టుకుని ఫైవ్ స్టార్ హోటళ్లలో పందికొక్కుల్లా మెక్కుతూ దీక్షల పేరుతో మరో కొత్త నాటకానికి తెరతీశారు' అని ఎద్దేవా చేశారు. 24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ హెచ్చరించారు. దాసోజు మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ధర్నాల పేరుతో రైతులను మభ్యపెడుతూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నాయని విమర్శించారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రైతుల పంట కొనడానికి, వారికి మేలు చేయడానికి ఇంత డ్రామా అవసరమా? అని ప్రశ్నించారు.