Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమానత్వ ఉద్యమాలే ఆయనకు నిజమైన నివాళి
- జయంతి ఉత్సవాల్లో కేవీపీఎస్, వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శూద్రులకు, మహిళలకు చదువునేర్సిన మానవతా వాది జ్యోతిరావు ఫూలే అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్‌బాబు, వృత్తి సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవీ రమణ చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని కేవీపీఎస్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ( ఎస్వీకే), వృత్తి సంఘాల ఆధ్వర్యంలో తమ కార్యాలయంలో ఫూలే195వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ నేటి నాగరిక సమాజం కోసం నాడు జోతిభా కొవ్వొత్తిలాగా కరిగి వెలుగులు పంచాడని చెప్పారు. ఆయన కృషి వల్లే దేశంలో మెజార్టీ ప్రజలకు విద్య దక్కిందన్నారు. ఆయన స్పూర్తితో సమానత్వ ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. మూడు వేల ఏండ్ల నాటి మనుస్మృతి అధర్మ శాస్త్రాలు ప్రజలకు చదువు సంపదలన్నింటికీ దూరం చేశామని చెప్పారు. మనుషులందరూ సమానులే అందరికీ సమాన అవకాశాలుండాలనే ధృడసంకల్పంతో ఫూలే తుది శ్వాస వరకు పనిచేశారన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ పూలే నుంచి నేటి తరం చాలా నేర్చుకోవలన్నారు. చనువు సమానత్వం కోసం ఆయన తుదిశ్వాస వరకు కృషి చేశాడని చెప్పారు. సాంఘీక దురాచారాలపై ఆయన పోరాడారన్నారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ కోశాధికారి ఎస్ రమేష్ రెడ్డి ఉపాధ్యక్షులు ఎం ఎన్ ఆర్ రావు, సీనియర్ వాకర్స్ రాఘవ రెడ్డి,రాజేందర్ ఎస్వీకె సీనియర్ నాయకులు జి రఘుపాల్, వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్,డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కేవీపీఎస్ నగర కార్యదర్శి కె యాదగిరి, నగర నాయకులు వెంకట్రావు ,భిక్షపతి, ఎస్వీకే నాయకులు వి శివశంకర, కష్ణ ప్రసాద్, చెన్నయ్య, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
వృత్తిదారుల సంఘం కార్యాలయంలో లెల్లెల బాలకృష్ణ అధ్యక్షతన ఫూలే జయంతి సభలో ఎంవీ రమణ మాట్లాడుతూ సామాజిక విప్లవకారుడన్నారు. ఆనాటి మూఢనమ్మకాలు, సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆనాడే చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించి ప్రోత్సహించాడన్నారు. స్వయంగా పాఠశాలలు నడిపాడని తెలిపారు. తన భార్య సావిత్రిబాయి ఫూలేకు చదువు నేర్పి మహిళా పాఠశాలలు ఏర్పాటు చేసి చదువు చెప్పించడం చిన్న విషయం కాదన్నారు. కుల నిర్మూలనతో పాటు మహిళోద్దరణకు కృషి చేశాడని చెప్పారు. కార్యక్రమంలో వత్తిదారుల రాష్ట్ర నాయకులు పి ఆశయ్య, ఉడత రవీందర్, శ్రీ రాములు ,కాసాని రజిత,గణేష్ సీఐటీయూ రాష్ట్ర నాయకులు వంగూరి రాములు, కోటంరాజు, కూరపాటి రమేష్, బ్రహ్మచారి, సోమన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.