Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వీది వ్యాపారులకు తమ లక్ష్యానికి మించి రుణాలు అందించినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బిసి) తెలిపింది. గృహ, పట్టణ వ్యవహారల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సంజరు కుమార్ సోమవారం తెలంగాణ ఎస్ఎల్బిసికి యాదృచ్చికంగా హాజరయ్యారు. పిఎంస్వనిధిపై బ్యాంకర్ల ప్రగతిని ఆయన సమీక్షించారు. దీనికి ఎస్ఎల్బిసి ప్రెసిడెంట్, ఎస్బిఐ సిజిఎం అమిత్ జింగ్రన్, ప్రభుత్వ, ప్రయివేటు రంగంలోని బ్యాంక్‌ల ప్రతినిధులు హాజరయ్యారు. పిఎంస్వనిధిలో భాగంగా రాష్ట్రంలో 3.40 లక్షల వీది వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని నిర్దేశించగా.. తాము ఏకంగా 3,43,587 మందికి అప్పులిచ్చామని.. ఇది లక్ష్యంలో 101 శాతమని ఎస్ఎల్బిసి తెలిపింది. ఈ పథకంలో తొలి దశలో 4.07 లక్షల దరఖాస్తులు వస్తే.. 3,57,290కి రుణాలు ఇచ్చామని పేర్కొంది. అత్యధిక రుణాల జారీలో తెలంగాణ రాష్ట్రం దీర్ఘకాలం తొలి స్థానంలో కొనసాగిందని సంజరు కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ తొలి స్థానంలోకి వచ్చిందన్నారు. తిరిగి తెలంగాణ ఈ స్థానాన్ని పొందేలా చర్యలు ఉండాలన్నారు. రుణాల జారీపై బ్యాంక్‌లు తక్షణమే తమ పోర్టల్‌లను అప్డేట్ చేసుకోవాలన్నారు.