Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఛత్తీస్‌ఘడ్‌లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004, నవంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లో ఉన్న కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పింఛన్ స్కీం (ఓపీఎస్)ను పునరుద్ధరించిందని ఎన్ఎంఓపీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గంగాపురం స్థితప్రజ్ఞ, టీఎస్సీపీఎస్ఈయూ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ తెలిపారు. అందుకనుగుణంగా జనరల్ ప్రావిడెంట్ అకౌంట్లు ఓపెన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల మంగళవారం ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. మార్చి తొమ్మిదో తేదీన అసెంబ్లీ సమావేశాల్లో చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్భాగేల్ సీపీఎస్ ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఈనెల నుంచి ఉద్యోగుల పది శాతం కాంట్రిబ్యూషన్‌ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. గతనెలలోనే రాజస్థాన్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యా యుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.