Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం ధాన్యం కొనుగోలు నిర్ణయం : టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ నిర్వహించబోయే సభకు రాహుల్‌గాంధీ రానుండటం తోనే టీఆర్ఎస్ సర్కారు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పోరాట ఫలితమే ధాన్యం కొంటామని ప్రకటించిందని తెలిపారు. ఈమేరకు మంగళవారం రేవంత్ ట్వీట్ చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతున్నదని తెలిపారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ను నమ్మడానికి లేదనీ, చివరి గింజకొనే వరకు నిఘా పెడతామని హెచ్చరించారు. తేడా వస్తే సీఎంను వదిలిపెట్టబోమన్నారు. కేసీఆర్ సొంత జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.