Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకేరోజు ఐదు దుకాణాల్లో చోరీ..
- రూ.8.88 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
నవతెలంగాణ-చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఐదుగురు దుండగులు ఐదు దుకాణాల్లో చోరికి పాల్పడి రూ.8,88,000 (నగదుతో పాటు వస్తువుల విలువ కలిపి) ఎత్తుకెళ్లారు. ఒకేరాత్రి ఐదు దుకాణాల్లో దొంగతనం జరగడంతో చేర్యాలలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు మూడు గంటల సమయంలో ఐదుగురు దొంగలు పట్టణంలోని భద్రకాళి షాపింగ్ మాల్ షెటర్ను తెరిచి చోరికి పాల్పడ్డారు. రూ.8 లక్షలను ఈ దుకాణం నుంచి ఎత్తుకెళ్లారు. అలాగే భాస్కర్ మొబైల్స్ దుకాణంలో రూ.82,000, ఓ కిరాణం షాపులో రూ.6వేలను దొంగలించారు. కాగా మరో రెండు కిరాణా దుకాణాల్లో చోరికీ ప్రయత్నించినప్పకీ.. నగదు లేకపోవడంతో వెనుదిరిగారు. మొత్తంగా ఒకేరోజు ఎనిమిది లక్షలకు పైన చోరి జరగడంతో చేర్యాలలో కలకలం చెలరేగింది. పోలీసులు, క్లూస్ టీంతో ఘటనా స్థలాలకు చేరుకొని ప్రాథమిక దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించేందుకు పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.