Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో చివరి పనిదినం మే 19 అని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 13వ తేదీ జూనియర్ కాలేజీలకు చివరి పనిదినంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు మే 6 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి పనిదినాన్ని మే 19వ తేదీ వరకు పొడిగించామని తెలిపారు. సోమవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నైతికత, మానవ విలువలు, మంగళవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పర్యావరణ విద్య పరీక్షలు జరిగాయి. జూనియర్ కాలేజీల చివరి పనిదినం వరకు గెస్ట్ లెక్చరర్ల సేవలను పొడిగించినందుకు గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.