Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ జిందాబాద్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవో నెం.111 ఎత్తి వేసేందుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ జిందాబాద్ డిమాండ్ చేసింది. ఈ నిర్ణయంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లతో పాటు హైదరాబాద్ నగర భవిష్యత్‌కు, పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణానికి హానికరమైన జీవో 111 రద్దు నిర్ణయంతో, హరితహారం ప్రభుత్వ ఆర్భాటం బూటకమని ఆరోపించింది. కాలుష్యం పెరిగిపోతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.అంజయ్య, కె.వీరయ్య ¸క ప్రకటన విడుదల చేశారు.''111 జీవో పరిధిలో ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘన, కాలుష్య కారక అనుమతులు వీటన్నింటిపై సమగ్ర సమాచారంతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. గతంలో నగరంలో 22 చెరువుల అలుగులు పగలగొట్టి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారనీ, వాటి ప్రభావం అనుభవిస్తున్నామనీ, ప్రస్తుతం 111 జీవో రద్దు మరింత దుష్పరిణామాలకు దారి తీస్తుంది. ఈ నిర్ణయం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఈ చర్య వల్ల మంచినీటి సమస్య, పర్యావరణపరంగా నగర ప్రజానీకానికి తీవ్ర నష్టం. 84 గ్రామాల ప్రజల ప్రయోజనం కోసమే అని ప్రభుత్వం చెబుతున్నది. వారి కోసం ప్రత్యేక ప్యాకేజి ప్రకటించవచ్చు, కానీ జీవో 111 రద్దు పరిష్కారం కాదని'' అభిప్రాయపడ్డారు.''2019లో హైదరాబాద్‌లో వచ్చిన వరదల నుంచైనా ప్రభుత్వాలు గుణపాఠాలు తీసుకోవాలి. చెరువులు, నాలాలు అంతర్ధానమైన ఫలితమే, వరదల్లో నగర ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఇప్పటికే వాతావరణ మార్పులతో ఆకాల వర్షాలు, వరదలు అనేక నగరాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్ప్నుడు జీవో111 రద్దు వల్ల మరిన్ని వైపరీత్యాలు జరగడానికి దారితీస్తుంది. జలాశయాలను పరిరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని, అనేక అభివృద్ధి చెందిన దేశాలలో చేపడుతున్న చర్యలను చూసైనా మారాలని '' కోరారు.