Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులను అడ్డుకున్న విద్యార్థులు
- అరెస్టు చేసి.. స్టేషన్‌కు తరలింపు
- వర్సిటీకి వంద కోట్లు కేటాయించాలని డిమాండ్
నవతెలంగాణ - మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌ను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రులను అడ్డుకుంటారని గ్రహించిన పోలీసులు ఎంఎస్ఎఫ్, ఎన్ఎస్యూ, టీఎస్వీఎం సంఘాల నాయకులు బత్తిన రాము, కార్తీక్, గ్రూప్ సింగ్‌ను ముందస్తుగా అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రుల వాహనాలకు అడ్డుపడి నిరసన తెలిపిన విద్యార్థులను కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు కేటాయించాలని పలుమార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. తక్షణం యూనివర్సిటీకి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టులు చేసినా పోరాటాలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో కరుణాకర్, సురేష్, శీను తదితరులున్నారు.