Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బార్ కౌన్సిల్ ఎదుట రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల నిరసన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ హైకోర్టునుండి తమ న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాలకు బదిలీలు చేయడాన్ని నిలుపుదల చేయాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసించారు. ఈ మేరకు హైకోర్టు న్యాయవాదులు భోజన విరామ సమయంలో బార్ కౌన్సిల్ గేటు ముందు రోడ్డుపై నినాదాలు చేస్తూ, నిరసన తెలియజేశారు. గతంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూ ర్తులు ముగ్గుర్ని, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ సరిహద్దున ఉన్న పంజాబ్, త్రిపుర హైకోర్టులకు బదిలీ చేశారనీ, ఇటీవల ఓ ఆంధ్ర న్యాయమూర్తిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారని, మరికొందరు తెలంగాణ న్యాయమూర్తులను ఇక్కడి నుండి ఇతర రాష్ట్ర హైకోర్టులకు బదిలీ చేసి, వాళ్ల స్థానంలో ఆంధ్ర హైకోర్టు న్యాయ మూర్తుల్ని తెచ్చి తెలంగాణ హైకోర్టులో నియమించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆందోళన వక్తంచేశారు. పూర్వ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎం రాజేందర్ రెడ్డి, పూర్వ తెలంగాణ హైకోర్టు అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది, సరసాని సత్యం రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రాంతీయేతర న్యాయమూర్తులకు ఇక్కడి ప్రజల మనోభావాలు తెలియవనీ, దానివల్ల ప్రజలకు సరైన న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ అస్థిత్వాన్ని మంటగలిపే చర్యల్ని తెలంగాణ సమాజం సహించదని న్యాయవాది నరేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ న్యాయవాదుల జెఎసీ అధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు, ఎ. జగన్, చిక్కుడు ప్రభాకర్, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ సత్య నారాయణ, జి.సంజీవ్, రాజేష్ రెడ్డి, రాజేష్ నెహతా తదితురులు పాల్గొన్నారు.