Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లోని తెలంగాణ గెజిటెడ్ భవన్లో గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి టీజీవో అధ్యక్షురాలు వి మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ఎంత కాలం జీవించామన్నది కాదనీ, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యమన్న అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని చెప్పారు.