Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- IOQM (ఐఓక్యూఎం) 2022 ఒలింపియాడ్‌లో అత్యధిక సెలక్షన్స్
- ఐఓక్యూఎం స్టేజ్ - 1 లో దేశవ్యాప్తంగా
- 23 అత్యధిక సెలక్షన్స్ తో నారాయణ విజయపరంపర
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మ్యాథమేటిక్స్ టీచర్స్ అసోసియేషన్ (ఇండియా) (MTAI) - హౌమిబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైయర్ ఇన్ మ్యాథమ్యాటిక్స్ (IOQM) - 2022 మొదటి దశ ఫలితాలలో దేశంలోనే అత్యధికంగా 23 సెలక్షన్స్‌తో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించింది. ఈ విషయాన్ని నారాయణ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డా|| పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 23 సెలక్షన్స్‌లో 10 సెలక్షన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర రీజియన్‌లోని స్కూల్స్ నుంచి సాధించగా, మిగిలిన 13 సెలక్షన్స్ దేశవ్యాప్తంగా ఉన్న నారాయణ కాలేజీల నుంచి సాధించినట్టు తెలిపారు. ఈ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులందరు నారాయణ సీఓ, ఒలింపియాడ్, ఈ-టెక్నో ప్రోగ్రామ్ లో శిక్షణ పొందిన విద్యార్థులే అని ఆమె వివరించారు. ఈ స్థాయి సిలక్షన్స్ ఒక్క నారాయణకు తప్ప ఇండియాలో మరి ఏ ఇతర విద్యాసంస్థ సాధించలేదని పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి పోటీపరీక్ష నిర్వహించినా నారాయణ స్కూల్స్ లో తర్ఫీదు పొందిన విద్యార్థులే అగ్రగామిగా నిలుస్తున్నారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్ స్థాయిలో జరిగే అన్ని పోటీపరీక్షలలో నారాయణ అప్రతిహతంగా విజయపరంపరను కొనసాగిస్తోందని వివరించారు.ఈ ఫలితాల ద్వారా ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైయర్ ఇన్ మ్యాథమ్యాటిక్స్ (ఐఓక్యూఎం) చరిత్రలోనే నారాయణ విజయపతాకం అత్యున్నత స్థాయిలో ఎగురుతున్నదని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా|| పి. సింధూర నారాయణ పేర్కొన్నారు. స్కూల్ స్థాయి పోటీపరీక్షల్లో విజయం కోసం ప్రత్యేకంగా సీఓ స్పార్క్, ఒలింపియాడ్, ఈ-టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ ప్రోగ్రామ్స్ కోసం ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి మెటీరియల్‌ను రూపొందించామన్నారు. అంతేకాకుండా ఇటీవల విడుదలైన ఒలింపియాడ్లలో నారాయణ అగ్రస్థానం కైవశం చేసుకుందని తెలిపారు. ఇలాంటి అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, విజయాలకై పాటుపడుతున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా అభినందించారు.