Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితులు, మహిళలపై దాడులు పెరిగాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన హిట్లర్ను మించిపోయిందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కేసీఆర్ మాట కుట్ర పూరితమని విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తరిమికొడితేనే అంబేద్కర్ కలలు సాకరమవుతాయన్నారు. పెట్రోలు, వంటగ్యాస్ ధరలు పెంచినందుకు బండి సంజరు పాదయాత్ర చేస్తున్నాడా? చెప్పాలన్నారు.