Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరామర్శించిన ప్రముఖులు
నవతెలంగాణ-బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి (26) గురువారం తెల్లవారుజామున బూర్గంపాడు మండలం సారపాకలోని ఆమె నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాలక్ష్మి ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసి సారపాకలో ఉంటూ ఉన్నత విద్య కోసం సిద్ధమవు తున్నారు. పీజీ సీటు విషయంలో మానసిక ఒత్తిడికి లోనయింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి నట్టు తెలుస్తోంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మహాలక్ష్మిని భద్రాచలం తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. దాంతో మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం భద్రాచలం ఏరియాస్పత్రికి తరలించారు. దమ్మపేటలో ఉన్న తాటి వెంకటేశ్వర్లుకు సమాచారం అందించడంతో ఆయన హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచు కున్న తన కుమార్తె విగతజీవిగా కనిపించడంతో తాటి కన్నీరు మున్నీరుగా విలపించారు. శవపరీక్ష అనంతరం మృత దేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిం చారు. ఈమె మృతితో సార పాకలో విషాదఛాయలు అలుము కున్నాయి. తండ్రి ఫిర్యాదు మేరకు బూర్గంపాడు ఎస్ఐ సముద్రాల జితేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, తాటి వెంకటేశ్వర్లును మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఫోన్ ద్వారా పరామర్శించారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారపాకకు చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించారు.
తాటి వెంకటేశ్వర్లు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. మహాలక్ష్మి మృతదేహాన్ని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ చైర్మెన్ కూరాకుల నాగభూషయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, జలగం జగదీశ్, సుధాకర్‌రెడ్డి, గోనె దారుగ, శ్రీహరి, కొనకంచి శ్రీను తదితరులు వెంకటేశ్వర్లును పరామర్శించి నివాళులర్పించారు.