Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టికెట్ కొన్న మోడీ
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి సంగ్రాహాలయ మ్యూజియాన్ని ప్రధాని మోడీ గురువారం ప్రారంభించి.. తొలి టికెట్‌ను కొనుగోలు చేశారు. కాగా, ఈ మ్యూజియాన్ని ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన 14 మంది ప్రధానులకు మోడీ అంకితమిచ్చారు. గత ప్రధానుల జీవిత కథలు, వివిధ సవాళ్లు ఎదురైనప్పుడు దేశాన్ని ఎలా నడిపించారో తెలియజేసేలా మ్యూజియాన్ని రూపొందించినట్టు అధికారులు తెలిపారు. దేశ చరిత్ర, స్వాతంత్య్ర సంగ్రామం నాటి కథనాలు కూడా మ్యూజియంలో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. పార్టీలకతీతంగా ప్రధానుల సహకారాన్ని గుర్తించడమే దీని ఉద్దేశమని వెల్లడించారు. 14 మంది ప్రధానుల గురించి అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ఈ మ్యూజియాన్ని నిర్మించినట్టు తెలిపారు. ఈ మ్యూజియంలో తొలి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రు, ఆయన సేవల సంబంధించి చిత్రాలున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఆయనకు లభించిన అనేక బహుమతులను తొలిసారిగా ప్రదర్శించారు.