Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటురంగంలో రిజర్వేషన్ల అమలు కోసం చట్టం తేవాలి :
- అంబేద్కర్ జయంతిలో రైతు సంఘం, వ్యకాస నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలను సమీకరించి బలమైన పోరాటాలను చేయడమే అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూములను జాతీయం చేయాలని ఆనాడు అంబేద్కర్ ప్రతిపాదిస్తే నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ప్రభుత్వ భూములు, ఆస్తులను అమ్మకానికి పెట్టిందన్నారు. పేదలపై పన్నుల భారం మోపి కార్పొరేట్ యాజమాన్యాలకు అనేక పన్ను రాయితీలను ప్రకటిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని నీరుగార్చి రాజ్యాంగంలో పొందు పరిచిన రిజర్వేషన్ల ఉనికినే లేకుండా చేసే కుట్రకు బీజేపీ పూనుకున్నదన్నారు. రానున్న కాలంలో ప్రవేటురంగంలో విద్యా ఉపాధి అవకాశాలల్లో రిజర్వేషన్ల అమలుకోసం చట్టాలు తేవాలని బలమైన పోరాటాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా వచ్చిన భూ సీలింగ్ చట్టాలను అమలు చేసి భూస్వాముల చేతుల్లోని మిగులు భూములను పేదలకు పంచడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శిం చారు. మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కులుం డాలనీ, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఉండాలనీ, పని ప్రదేశంలో కార్మికుల హక్కులకు రక్షణగా కార్మిక చట్టాలు ఉండాలని అంబేద్కర్ కొట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. నేటికీ దేశంలో అవేమీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రత కు ముంపు వాటిల్లిందనీ, రైతుల దగ్గర నుండి ధాన్యం సేకరణ, ఎఫ్‌సీఐల నిర్వాహణ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుంటు న్నదని విమర్శించారు.దళితులు,ఆదివాసీ గిరిజను లు,మైనార్టీలు,మహిళల హక్కులపై పెద్దఎత్తున సంఫ్‌ు పరివార్ శక్తులు దాడులకు పూనుకుంటున్నా యని విమర్శించారు. తిండి,బట్ట,పెండ్లి వంటి ఆచా ర సాంప్రదాయాలపై ఆంక్షలతో పాటు రిజర్వేషన్లు సమీక్షించాలనీ, ఎస్సీ,ఎస్టీ చట్టాలను రద్దు చేయాలని బీజేపీ చూస్తున్నదని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కు అభ్యుదయ భావాలు కలిగిన వారందరినీ ఒకతాటి మీదకు తీసుకొచ్చి బలమైన ఉద్యమాలను నిర్మించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ నాయక్, వ్యవసా య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శ్రీ కాంత్, కురపాటి రమేష్ పాల్గొన్నారు..